Vijayawada: దేశంలో అత్యంత స్వచ్ఛ నగరాల జాబితా విడుదల.. హైదరాబాద్‌, విజయవాడ, తిరుపతిలకు స్థానాలు

  • ప్రకటించిన కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ
  • దేశంలోనే స్వచ్ఛనగరం ఇండోర్
  • తిరుపతి, విజయవాడలకు స్థానాలు

స్వచ్ఛ సర్వేక్షణ్-2018 అవార్డులను కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ ఈ రోజు ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ దేశంలోనే స్వచ్ఛ నగరంగా నిలవగా, ఆ జాబితాలో తరువాతి స్థానాల్లో భోపాల్, చండీగఢ్‌ ఉన్నాయి. 10 లక్షలకు పైగా జనాభా గల నగరాల జాబితాలో దేశంలోనే స్వచ్ఛమైన నగరంగా విజయవాడ నిలవగా, 1-3 లక్షల లోపు జనాభా గల నగరాల జాబితాలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌ మెంట్‌లో తిరుపతి భారత్‌లోనే ఉత్తమ నగరంగా నిలిచింది.

స్వచ్ఛ రాజధాని నగరంగా గ్రేటర్ ముంబయి ఉంది. 1-3 లక్షల లోపు జనాభా గల నగరాల జాబితాలో ఉత్తమ స్వచ్ఛ నగరంగా మైసూరు నిలిచింది. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌ మెంట్‌లో రాష్ట్రాల రాజధానుల జాబితాలో అగ్రస్థానంలో హైదరాబాద్‌ నిలిచింది. అలాగే, లక్షకుపైగా జనాభా గల పట్టణాల జాబితాలో సిద్ధిపేటకు మొదటి స్థానం దక్కింది. దేశ వ్యాప్తంగా 4,203 మునిసిపాలిటీల్లో 37.66 లక్షల మంది పౌరుల అభిప్రాయాలను సేకరించి ఈ అవార్డులను ప్రకటించారు.             

More Telugu News