stock market: కర్ణాటకలో ఉత్కంఠభరిత రాజకీయం.. రెండో రోజూ పతనమైన మార్కెట్లు

  • స్టాక్ మార్కెట్లపై కొనసాగుతున్న కర్ణాటక ప్రభావం
  • రెండో రోజూ కొనసాగిన నష్టాలు
  • 156 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం స్టాక్ మార్కెట్లపై కొనసాగుతోంది. నిన్న బీజేపీ ఆధిక్యంలో ఉన్నంతసేపు దూసుకుపోయిన మార్కెట్లు... ఆ తర్వాత బీజేపీ మెజార్టీ తగ్గడంతో క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ రోజు కూడా బెంగళూరులో సందిగ్ధ రాజకీయ వాతావరణం కొనసాగడంతో... మార్కెట్లు ఈ రోజు కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 156 పాయింట్లు కోల్పోయి 35,388కి పడిపోయింది. నిఫ్టీ 61 పాయింట్లు పతనమై 10,741కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండియా బుల్స్ రియలెస్టేట్ (12.20%), పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (8.79%), ఎడిల్ వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (6.13%), జీహెచ్సీఎల్ లిమిటెడ్ (6.10%), మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (6.05%).  

టాప్ లూజర్స్:
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (-15.26%), సిండికేట్ బ్యాంక్ (-12.30%), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (-12.15%), అదానీ ట్రాన్స్ మిషన్ లిమిటెడ్ (-8.28%), సెంచురీ ప్లైబోర్డ్స్ (-8.18%).  

More Telugu News