balu: ఇళయరాజా పాటలకి నేను న్యాయం చేస్తున్నాను గనుకనే నాకు అవకాశం ఇచ్చారని జానకి అన్నారు: బాలసుబ్రహ్మణ్యం

  • సంగీత దర్శకులకు కావలిసినట్టుగా పాడాలి 
  • లేదంటే రెండవసారి పిలవరు 
  • అందరూ ఆశించేలా పాడటం గాయకుల లక్షణం  

తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను గురించి ప్రస్తావించారు. "చంటి పిల్లాడు ఎవరు ఎత్తుకుంటే వాళ్ల చంకలోకి వెళ్లిపోతాడు .. అలాగే గాయకులనేవారు ఏ సంగీత దర్శకుడు పిలిస్తే ఆ సంగీత దర్శకుడి దగ్గరికి వెళ్లి వాళ్లు కోరుకుంటోన్న విధంగా పాడాలి . . లేదంటే రెండవసారి వాళ్లు పిలవరు"

"నేను సత్యం గారికి .. రాఘవులు గారికి .. చక్రవర్తి కొత్తగా వస్తే ఆయన సినిమాలకి పాడాను. ఘంటసాల .. పెండ్యాల .. రాజేశ్వరరావు మాస్టార్ల సినిమాలకు పాడాను. ఎవరి బాణీలకు తగినట్టుగా వాళ్లకి పాడటమనేది గాయకుల లక్షణం. తమ పాటలకు న్యాయం చేస్తున్నారని అనిపించినప్పుడే ఎవరైనా పిలుస్తారు".

ఒకసారి ఒకరు జానకమ్మ గారితో "అంతకు ముందు మీ కెరియర్ ఆటుపోట్లతో ఉండేది . . ఇళయరాజా వచ్చాక మీకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు" అంటూ ఏదో మాట్లాడబోయారు. "ఒక క్షణం ఆగు అన్నారు ఆవిడ .. ఇళయరాజా నన్ను పోషించడంకోసం నాకు అవకాశాలు ఇవ్వడం లేదు .. ఆయన పాటలకి నేను న్యాయం చేస్తున్నాను గనుక ఇస్తున్నారు. ఆయన అవకాశాలు ఇస్తున్నందుకు ధన్యవాదాలు .. ఇవ్వక ఏం చేస్తారు .. నేను బాగా పాడతాను మరి " అన్నారంటూ చెప్పుకొచ్చారు.   

More Telugu News