'ఎమ్మెల్యేకు 100 కోట్లు, మంత్రి పదవి' ఆఫర్ పై ప్రకాశ్ జవదేకర్ స్పందన

16-05-2018 Wed 15:25
  • కుమారస్వామి ఆరోపణలు ఊహాజనితం
  • ఇలాంటి రాజకీయాలు కాంగ్రెస్, జేడీఎస్ లే చేస్తాయి
  • నిబంధనల మేరకే తాము వ్యవహరిస్తున్నాం

తమ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు బీజేపీ యత్నిస్తోందని... ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 100 కోట్లు, మంత్రి పదవిని ఆఫర్ చేసిందంటూ జేడీఎస్ శాసనసభాపక్ష నేత కుమారస్వామి తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, కర్ణాటక బీజేపీ ఇన్ ఛార్జ్ ప్రకాశ్ జవదేకర్ స్పందించారు.

కుమారస్వామి ఆరోపణలు ఊహాజనితమని ఆయన అన్నారు. ఇలాంటి పనులకు బీజేపీ దూరమని.... ఇలాంటి రాజకీయాలను కాంగ్రెస్, జేడీఎస్ చేస్తాయని విమర్శించారు. నిబంధనల ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన తమను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని గవర్నర్ ను కోరామని చెప్పారు. యడ్యూరప్ప నాయకత్వంలో కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే నమ్మకం తమకు ఉందని అన్నారు.