vivo smart phone: హైఎండ్ ఫీచర్లతో వివో ఎక్స్21 ఐ ఆవిష్కరణ... 19:9 డిస్ ప్లే

  • ధర మన రూపాయిల్లో అయితే సుమారు 28,990
  • హీలియో పి60 ప్రాసెసర్
  • ఫోన్లో 90 శాతం స్కీన్ పరిమాణం

వివో కంపెనీ ఎక్స్21ఐ పేరుతో స్మార్ట్ ఫోన్ ను చైనాలో విడుదల చేసింది. దీని ధరను రూ.2,698 యువాన్లుగా ఖరారు చేసింది. రూపాయిల్లో అయితే సుమారు 28,900. 4జీబీ ర్యామ్, 6జీబీర్యామ్, 64జీబీ, 128జీబీ స్టోరేజీలతో రెండు వేరియంట్లను విడుదల చేసింది. వివో ఎక్స్ 21, 21ఐకు ప్రధానంగా తేడా ఏమిటంటే, వివో ఎక్స్21లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 660 ఎస్వోసీ ప్రాసెసర్ వాడారు. ఎక్స్21ఐలో హీలియో పి60 ప్రాసెసర్ వినియోగించారు.

స్పెసిఫికేషన్ల విషయానికొస్తే 6.28 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, 19:9 యాస్పెక్ట్ రేషియోతో ఫుల్ స్క్రీన్, సూపర్ అమోలెడ్ డిస్ ప్లే, 2.5 డి కర్వ్ డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ లో స్క్రీన్ 90.3 శాతం మేర ఉంటుంది. ఫోన్ వెనుక 12+5 మెగా పిక్సల్ కెమెరాలతో డ్యుయల్ సెటప్ ఉంది. ముందు భాగంలో 24 మెగా పిక్సల్స్ కెమెరా ఏర్పాటు చేశారు. 3,245 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్ లాక్ ఫీచర్లు కూడా ఉన్నాయి. భారత్ లో విడుదల తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

More Telugu News