surya: సూర్య సరసన ఛాన్స్ కొట్టేసిన సాయేషా సైగల్!

  • తమిళనాట సాయేషా జోరు 
  • వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు 
  • కేవీ ఆనంద్ మూవీలోను అవకాశం  

ప్రస్తుతం సూర్య .. సెల్వరాఘవన్ దర్శకత్వంలో 'ఎన్ జి కె' సినిమా చేస్తున్నాడు. విభిన్నమైన కంటెంట్ తో ఈ సినిమా రూపొందుతోంది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సూర్య ఈ సినిమా తరువాత కె.వి.ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి.

 ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కొంత మంది పేర్లను పరిశీలించారు. చివరికి సాయేషా సైగల్ ను ఎంపిక చేశారనేది తాజా సమాచారం. ఈ మధ్య కాలంలో తమిళనాట సాయేషా జోరు పెరిగింది. ప్రస్తుతం ఆమె అక్కడ కార్తీ .. ఆర్య .. విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. తాజాగా సూర్య సినిమాలోనూ ఛాన్స్ కోటేసింది. ఈ సినిమాలో మోహన్ లాల్ .. అల్లు శిరీష్ ముఖ్యమైన పాత్రలను పోషించనుండటం విశేషం.   

More Telugu News