daignostic list: ప్రతి ఒక్కరూ చేయించుకోవాల్సిన 58 వైద్య పరీక్షలను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

  • సాధారణ వ్యాధులను వీటితో నిర్ధారించొచ్చు
  • ప్రభావవంతమైన చికిత్సకు వ్యాధి నిర్థారణ కీలకం
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన

ప్రపంచ ఆరోగ్య సంస్థ అందరూ చేయించుకోతగిన 58 వైద్య పరీక్షలతో ఓ జాబితాను రూపొందించింది. చాలా వరకు సాధారణ వ్యాధుల్ని ఈ పరీక్షల ద్వారా గుర్తించొచ్చని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. వైద్య పరీక్షల సేవలు, సరైన చికిత్స పొందలేని పరిస్థితులను నివారించేందుకు జాబితాను విడుదల చేసింది. ‘‘ప్రభావవంతమైన చికిత్సకు కచ్చితమైన వ్యాధి నిర్ధారణ అన్నది మొదటి అడుగు. వైద్య సేవల అందుబాటు లేకపోవడం వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడరాదు, ప్రాణాలు కోల్పోరాదు’’ అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రేసెస్ అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా పెద్దల్లో టైప్-2 మధుమేహం ఉన్న వారిలో 46 శాతం మందిని గుర్తించడం లేదని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. హెచ్ఐవీ, టీబీ తరహా ఇన్ఫెక్షన్ వ్యాధులను ఆలస్యంగా గుర్తించినట్టయితే అవి మరింత వ్యాప్తి చెంది పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నో సాధారణ అనారోగ్య పరిస్థితులను గుర్తించేందుకు నిర్వహించాల్సిన 58 పరీక్షలను నిర్ధారించింది. వీటన్నింటికీ కలిపి ఓ కనీస ప్యాకేజీగా రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. హెచ్ఐవీ, టీబీ, మలేరియా, హెపటైటిస్ బి, సి, హ్యుమన్ పాపిలోమా వైరస్, సిఫిలిస్ తదితర వ్యాధి నిర్ధార పరీక్షలు ఇందులో ఉన్నాయి. అయితే, ఈ తప్పనిసరి వైద్య పరీక్షల జాబితాలో ఉన్న పరీక్షల వివరాలను డబ్ల్యూహెచ్ఓ ఇంకా విడుదల చేయలేదు.

More Telugu News