nagarjuna: నాగార్జున నెక్స్ట్ మూవీగా 'బంగార్రాజు'

  • 'నేల టిక్కెట్టు' పనుల్లో కల్యాణ్ కృష్ణ  
  • 'ఆఫీసర్ ' మూవీతో నాగ్ బిజీ 
  • ఇద్దరి కాంబినేషన్లో 'బంగార్రాజు'

కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున కొంతకాలం క్రితం 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా చేశాడు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున పల్లెటూరి మోతుబరిగా 'బంగార్రాజు' పాత్రలో కనిపించాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడం .. 'బంగార్రాజు' పాత్ర జనంలోకి దూసుకుపోవడం జరిగింది. దాంతో ఇదే పాత్రను ప్రధానంగా చేసుకుని .. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనే నాగ్ ఒక సినిమా చేయాలనుకున్నాడు. కానీ ఇతర ప్రాజెక్టుల కారణంగా కుదరలేదు.

 ఇప్పుడు కల్యాణకృష్ణ 'నేల టిక్కెట్టు' విడుదలైన తరువాత ఫ్రీ అవుతాడు. అలాగే 'ఆఫీసర్' సినిమా రిలీజ్ తరువాత నాగ్ ఫ్రీ అవుతాడు. అందువలన తమ తదుపరి ప్రాజెక్టుగా ఈ సినిమాను పట్టాలెక్కిద్దామనే ఆలోచనలో నాగ్ వున్నారని సమాచారం. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ చివరిదశకు చేరుకుందనీ .. జూన్ 25వ తేదీన సెట్స్ పైకి వెళ్లనుందనే టాక్ వినిపిస్తోంది.   

More Telugu News