Karnataka: కర్ణాటకలో త్రిపుర తరహా రాజకీయాన్ని బీజేపీ చేసింది: మంత్రి సోమిరెడ్డి

  • కర్ణాటక ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు
  • త్రిపుర తరహా రాజకీయం ఇక్కడా చేసింది
  • ఈ ఎన్నికల్లో బీజేపీ రూ.10,500 కోట్లు ఖర్చు చేసింది
  • అందుకే, అన్ని స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది!

కర్ణాటక ఎన్నికల గురించి ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటక ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలుపొంది, అతిపెద్ద రాజకీయపార్టీగా అవతరించడంపై ఆయన స్పందిస్తూ, ఈ రాష్ట్రంలో కూడా త్రిపుర తరహా రాజకీయం చేసిందని విమర్శించారు.

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ రూ.10,500 కోట్లు ఖర్చు చేసినట్టు ఓ సర్వే తేల్చిందని అన్నారు. ఇంత మొత్తం ఖర్చు చేసింది కనుకే బీజేపీ అన్ని స్థానాల్లో విజయం సాధించిందని విమర్శించారు. అయితే, కాంగ్రెస్ కంటే బీజేపీకి తక్కువ శాతం ఓట్లు వచ్చాయని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఆటలు సాగవని సోమిరెడ్డి హెచ్చరించారు.

More Telugu News