ఈ ఎన్నికల్లో ఓడిపోతారని సిద్ధరామయ్యకు ముందే తెలుసు.. నేను రేపు ఢిల్లీకి వెళుతున్నా: యడ్యూరప్ప

14-05-2018 Mon 20:46
  • అందుకే సిద్ధరామయ్య దళితుడిని సీఎం చేస్తామని అన్నారు
  • రెండు వారాల ముందే ఆ ప్రకటనెందుకు చేయలేదు?
  • నేను రేపు మోదీని కలుస్తాను
కాంగ్రెస్‌ పార్టీ దళిత నేతను సీఎం చేయాలనుకుంటే తాను ఆ పదవిని వదులుకునేందుకు సిద్ధమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ఆ రాష్ట్ర బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప... సిద్ధరామయ్య ఈ విషయాన్ని రెండు వారాల ముందే ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోతుందని సిద్ధరామయ్యకు తెలుసని, అందుకే ఇటువంటి ప్రకటన చేశారని అన్నారు. కాగా, తాను రేపు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తానని యడ్యూరప్ప ప్రకటించారు.