mumbai: అక్రమ ఆయుధాలు విక్రయిస్తూ ముంబైలో పట్టుబడ్డ హైదరాబాదీ!

  • మాదన్నపేటకు చెందిన పాత నేరస్తుడు వహీద్ ఖాన్
  • అక్రమ ఆయుధాలు విక్రయిస్తున్న వైనం
  • వహీద్ ఖాన్ ఇంట్లో పోలీసుల సోదాలు

ముంబైలో అక్రమ ఆయుధాలు విక్రయిస్తూ హైదరాబాద్ వాసి పట్టుబడ్డాడు. హైదరాబాద్ లోని మాదన్నపేటకు చెందిన పాత నేరస్తుడు వహీద్ ఖాన్ అక్రమ ఆయుధాలు విక్రయిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. వహీద్ ఖాన్ కు ఉగ్రవాదులతో సంబంధాలేమైనా ఉన్నాయా అనే కోణంలో ముంబై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. మాదన్నపేటలోని అతని ఇంట్లో పోలీసులు సోదాలు ప్రారంభించారు.  

More Telugu News