microsoft: మూడు డిస్ ప్లేలతో కూడిన ట్యాబ్లెట్... పేటెంట్ కోసం మైక్రోసాఫ్ట్ దరఖాస్తు

  • రెండు ప్రధాన డిస్ ప్లేలు, ఒక చిన్న డిస్ ప్లే
  • లోపలకు, బయటకు మడవడానికి వీలు
  • ఇటీవలే మోటరోలా సైతం ఫోల్డబుల్ డివైజ్ పేటెంట్ కోసం దరఖాస్తు

ఫోల్డబుల్ డివైజ్ లు ఇప్పటికీ అధిక శాతం అభివృద్ధి దశలోనే ఉన్నాయి కానీ, కార్యరూపం దాల్చడం లేదు. ఈ మధ్య మోటరోలా డబుల్ స్క్రీన్ తో కూడిన ఫోల్డబుల్ ఫోన్ కోసం పేటెంట్ కు దరఖాస్తు చేసుకోగా, మైక్రోసాఫ్ట్ కూడా మూడు స్క్రీన్లతో మడవడానికి వీలుండే ట్యాబ్లెట్ కు సంబంధించి పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకుంది. వాస్తవానికి ఇది ట్యాబ్లెట్ మాదిరిగా ఉండే పరికరం మాత్రమే. దీన్ని లోపలికి, లేదా బయటకు కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు.

పరికరాన్ని ఓపెన్ చేసినప్పుడు రెండు ప్రధాన డిస్ ప్లేలు కనిపిస్తాయి. మరోచిన్న డిస్ ప్లే వీటికి ఆనుకుని ఉంటుంది. ఇది ఇంకా పేటెంట్ దశలోనే ఉందని, నిజంగా మార్కెట్లోకి వస్తుందా అని ఇప్పుడే చెప్పడం కష్టమంటున్నారు విశ్లేషకులు. చైనాకు చెందిన జెడ్ టీఈ ఇప్పటికే మడవడానికి వీలుండే ఆక్సన్ ఎం స్మార్ట్ ఫోన్ ను విక్రయిస్తోంది.

More Telugu News