amit shah: తిరుపతిలోని నాలుగుకాళ్ల మంటపం వద్ద బీజేపీ ఆందోళన.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్!

  • అలిపిరి ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న బీజేపీ శ్రేణులు
  • హోం మంత్రి పదవికి చినరాజప్ప రాజీనామా చేయాలంటూ డిమాండ్
  • అమిత్ షాపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ నినాదాలు

తిరుపతిలోని అలిపిరి వద్ద బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ పై టీడీపీ నేతలు, కార్యకర్తల రాళ్ల దాడి నేపథ్యంలో, బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు తిరుపతిలోని నాలుగుకాళ్ల మంటపం వద్ద బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అలిపిరి ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఘటనకు బాధ్యత వహిస్తూ హోం మంత్రి చినరాజప్ప తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దాడికి దిగిన టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు.

మరోవైపు, బీజేపీ నేతలే తమపై దాడి చేశారని ఆరోపిస్తూ, ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు అలిపిరి పోలీస్ స్టేషన్ వద్ద నిన్న అర్ధరాత్రి బైఠాయించారు. దాడి చేసింది బీజేపీ వారైతే... టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడమేంటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News