rajugadu: పర్సులు, స్మార్ట్‌ఫోన్‌లు కొట్టేస్తోన్న హీరో.. ఆకట్టుకుంటున్న 'రాజుగాడు' ట్రైలర్

  • నేడు రాజ్‌తరుణ్ పుట్టిన రోజు
  • 'రాజుగాడు'లో చోరీలు చేస్తోన్న రాజ్‌తరుణ్‌
  • అలరిస్తోన్న ట్రైలర్

యువనటుడు రాజ్ తరుణ్ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఆయన నటిస్తోన్న 'రాజుగాడు' సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను ఈ సందర్భంగా ఆ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో 'రాజుగాడు' పర్సులు, స్మార్ట్‌ఫోన్‌లు చోరీ చేస్తున్నాడు. అంతేకాదు, రాజుగాడికి అతడి తల్లి ప్రోత్సాహం కూడా ఉంది.

'ఏమైంది నానా, ఏ వస్తువూ తేకుండా ఇంటికెలా వచ్చావు?' అంటూ రాజుగాడి తల్లి డైలాగు కొడుతోంది. సంజనా రెడ్డి డైరెక్షన్‌లో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు గోపీచంద్ సంగీతం అందించారు. రాజ్‌ తరుణ్ సరసన అమైరా దస్తూర్ నటించింది.                             

More Telugu News