వ్యోమగామిగా వరుణ్ తేజ్.. షూటింగ్ ప్రారంభం!

11-05-2018 Fri 16:35
  • 'ఘాజీ' దర్శకుడి తాజా చిత్రం
  • అంతరిక్షం నేపథ్యంలో కథ 
  • వ్యోమగామి పాత్రలో వరుణ్    
మొదటి నుంచి కూడా వరుణ్ తేజ్ విభిన్నమైన పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. ఈ కారణంగానే 'కంచె' వంటి కథాబలమున్న చిత్రం ఆయన ఖాతాలోకి చేరింది. 'ఫిదా' .. 'తొలిప్రేమ' వంటి సక్సెస్ లు ఆయనను పలకరించాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకి సంకల్ప్ రెడ్డి ఒక కథను వినిపించడం .. ఆ కథకి వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. ఆ సినిమా రెగ్యులర్ షూటింగును ఈ రోజున మొదలెట్టారు.

ఈ సినిమాలో వరుణ్ సరసన లావణ్య త్రిపాఠి .. అదితీ రావు కథానాయికలుగా కనిపించనున్నారు. క్రిష్ సమర్పకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. అంతరిక్షం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో, వ్యోమగామి పాత్రలో వరుణ్ కనిపించనున్నాడు. సంకల్ప్ రెడ్డి ఇంతకుముందు తక్కువ బడ్జెట్ లో 'ఘాజీ' సినిమాకి భారీతనాన్ని తీసుకొచ్చి విజయాన్ని అందించాడు. అందువలన సహజంగానే ఈ ప్రాజెక్టుపై అందరిలోనూ ఆసక్తి వుంది.