mahanati: చంద్రబాబు నోట ‘మహానటి’ మాట!

  • ‘మహానటి’ బాగుందని తనతో చెప్పారన్న సీఎం చంద్రబాబు
  • ఈ సినిమా ఎలా ఉందని నాయకులను ప్రశ్నించిన అధినేత
  • ‘మహానటి’ని తప్పకుండా చూస్తానని చెప్పిన వైనం

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’పై ఇప్పటికే సినీ ప్రముఖులు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. ‘మహానటి’లో టైటిల్ రోల్ పోషించిన కీర్తి సురేశ్ నటన అద్భుతమంటూ ప్రశంసిస్తున్నారు. తాజాగా, ఈ చిత్రం గురించి చంద్రబాబు ప్రస్తావించినట్టు సమాచారం.

అమరావతిలో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ‘మహానటి’ గురించి అడిగారట. సావిత్ర్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ బయోపిక్ బాగుందని ఎయిర్ పోర్ట్ లో కొంతమంది ఇటీవలే తనతో చెప్పారని అన్నారట. ఈ సినిమా ఎలా ఉందని పార్టీ నాయకులను కూడా అడిగారట. సందేశాత్మక చిత్రమైన ‘మహానటి’ని తప్పకుండా చూస్తానని.. జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు నిర్మిస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని చంద్రబాబు అన్నాట్టు సమాచారం.

More Telugu News