amitsha: అమిత్ షా కాన్వాయ్ ను అడ్డుకున్న ఘటనపై విచారణ: ఏపీ మంత్రి చినరాజప్ప

  • టీడీపీ కార్యకర్తల ముసుగులో ఎవరో ఈ దాడి చేశారు
  • శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠినచర్యలు తప్పవు
  • ‘హోదా’ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేందుకు అనేక శక్తులు పనిచేస్తున్నాయి!

తిరుపతిలోని అలిపిరి వద్ద బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ పై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటనపై ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పందించారు. అమిత్ షా వాహనంపై దాడి జరగలేదని, ఆయన వాహనం వెనుక మరో వాహనంపై రాయి పడిందని అన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని, ఈ ఘటనపై విచారణ చేపడతామని చెప్పారు.

 ఏపీకి ప్రత్యేక హోదా సాధన నిమిత్తం జరుగుతున్న ఉద్యమం ప్రశాంతంగా జరుగుతోందని, ఈ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేందుకు అనేక శక్తులు పనిచేస్తున్నాయని ఆరోపించారు. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కల్పించినా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తల ముసుగులో ఎవరో దాడి చేసివుంటారని చినరాజప్ప అనుమానాలు వ్యక్తం చేశారు.

More Telugu News