b sriramulu: బీజేపీకి మరో షాక్.. శ్రీరాములును అనర్హుడిగా ప్రకటించాలంటూ ఈసీని కోరిన కాంగ్రెస్

  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శ్రీరాములు వీడియోలు
  • ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
  • ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని వినతి

కర్ణాటకలో ఎలాగైనా అధికారంలోకి రావాలని విశ్వయత్నం చేస్తున్న బీజేపీకి... గాలి జనార్దన్ రెడ్డి ప్రధాన అనుచరుడు బి.శ్రీరాములుకు చెందిన ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియో ఇబ్బందికరంగా మారింది. అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి అనుకూలంగా తీర్పునిచ్చేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్లుడితో శ్రీరాములు డీల్ మాట్లాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 2010లో ఈ డీల్ జరిగినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో, ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ నేతలు కలిశారు. ఎన్నికల్లో శ్రీరాములు పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. లంచం ఇవ్వజూపిన వీడియోలను ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ కు అందించారు. ఈ వీడియోల ప్రదర్శనకు అనుమతించాలని కోరారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని విన్నవించారు. 

More Telugu News