Samanta: మామయ్యా... కృతజ్ఞతలు!: సమంత

  • 'మహానటి'లో నటించిన సమంత
  • మెచ్చుకున్న అక్కినేని నాగార్జున
  • ట్విట్టర్ లో కృతజ్ఞతలు చెప్పిన సమంత

గడచిన బుధవారం విడుదలైన సావిత్రి జీవిత కథా చిత్రం 'మహానటి'లో ఆవిడ జీవిత చరిత్రను విశదీకరించే జర్నలిస్టు పాత్రలో సమంత నటించిన తీరును అక్కినేని నాగార్జున ప్రశంసించగా, అందుకు కృతజ్ఞతలు చెప్పింది సమంత. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ "థ్యాంక్యూ మామా... లవ్ యూ" అని ఓ పోస్టును పెడుతూ, నమస్కార ఎమోజీలను ఉంచింది.

ఈ సినిమాను చూసిన తరువాత తన కళ్లు చమర్చాయని, సావిత్రమ్మకు ఈ చిత్రం ఓ నివాళిగా నిలిచిపోతుందని, కీర్తి, దుల్కర్ సల్మాన్, సమంతలు చక్కగా నటించారని, నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారని గత రాత్రి నాగ్ ట్విట్టర్ లో మెచ్చుకోగా, సమంత ఇలా స్పందించింది.

More Telugu News