Marriage: వరుడి వయసు 13.. వధువు వయసు 23.. ఇదో రకం బాల్య వివాహం!

  • బాల్యవివాహానికి పరాకాష్టగా మారిన వివాహం
  • వరుడిని చూసి ఆశ్చర్యపోయిన బంధువులు
  • పెళ్లి పెద్దలను తిట్టిపోసిన వైనం

కర్నూలు జిల్లా కర్ణాటక సరిహద్దు మండలమైన కౌతాళంలోని ఓ కుగ్రామంలో వింత వివాహం జరిగింది. ఏప్రిల్ 27న జరిగిన ఈ వివాహం ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సంచలనంగా మారింది. బాల్య వివాహాలకు పరాకాష్టగా మారిన ఈ ఘటనలో వరుడి వయసు కేవలం 13 ఏళ్లు కాగా, వధువు వయసు 23 ఏళ్లు.

భర్త మద్యానికి బానిస కావడం, తాను అనారోగ్యంతో బాధపడుతుండడంతో తాను మరణిస్తే పిల్లల గతి ఏం కాను? అని ఆలోచించిన ఆ తల్లి పెద్ద కుమారుడికి పెళ్లి చేయాలని నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా బంధువుల అమ్మాయి (23)తో గత నెల 27న పెళ్లి జరిపించింది. వివాహానికి వచ్చిన వారు వరుడిని చూసి అవాక్కయ్యారు. కొందరు కోపం పట్టలేక పెళ్లి పెద్దలను తిట్టిపోశారు. ప్రస్తుతం ఈ విహహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చేస్తోంది.

More Telugu News