SEBI: 'సీఎండీ' పదవిని విడదీయండి... సెబీ కీలక ఆదేశాలు!

  • చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లు విడివిడిగా ఉండాలి
  • ఏప్రిల్ 2020లోగా విడదీయాల్సిందే
  • స్వతంత్ర డైరెక్టర్లలో ఓ మహిళ తప్పనిసరి
  • రిజిస్టర్డ్ కంపెనీలకు సెబీ ఆదేశాలు

రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ లో రిజిస్టర్ అయిన కంపెనీల్లో భారీ సంస్కరణలకు సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న సీఎండీ (చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్) పదవిని విడదీయాలని, చైర్మన్ వేరుగా, ఎండీ వేరుగా ఉండాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. సీఎండీ పదవిని విడదీసేందుకు 2020 ఏప్రిల్ వరకూ సమయం ఇచ్చింది. ఇక కంపెనీ బోర్డు డైరెక్టర్లుగా కనీసం ఆరుగురు ఇండిపెండెంట్లు ఉండాలని, వారిలో ఒక మహిళ తప్పనిసరిని తేల్చింది. ఈ కొత్త మార్పులను ప్రతి రిజిస్టర్డ్ సంస్థ ఏప్రిల్ 1, 2019లోగా చేసుకోవాలని ఆదేశించింది.  

ఇండియాలో కార్పొరేట్ పరిపాలనలో తీసుకురావాల్సిన మార్పులపై ఏర్పాటైన ఉదయ్ కోటక్ ప్యానల్ 80 సిఫార్సులు చేయగా, వాటిల్లో 40 సిఫార్సులకు సెబీ ఓకే చెప్పింది. ఇక కంపెనీలు, వాటి అనుబంధ సంస్థల్లో సెక్రటేరియల్ ఆడిట్ తప్పనిసరని, టాప్ 100 సంస్థలు తమ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ (వార్షిక సర్వసభ్య సమావేశం - ఏజీఎం)లను వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించింది. చేపట్టిన మార్పుల్లో అత్యధికం 2019 ఏప్రిల్ నుంచి 2020 ఏప్రిల్ లోగా అమలులోకి వస్తాయని సెబీ తన తాజా నోటిఫికేషన్ లో పేర్కొంది.

More Telugu News