cji: కొలీజియం సమావేశం ఏర్పాటు చేయండి .. సీజేఐకు జస్టిస్ చలమేశ్వర్ లేఖ

  • జస్టిస్ జోసఫ్ కు పదోన్నతి విషయమై లేఖ 
  • ‘సుప్రీం’ న్యాయమూర్తిగా నియమించాలని పునరుద్ఘాటన
  • జూన్ 22న పదవీ విరమణ చేయనున్నజస్టిస్ చలమేశ్వర్

జస్టిస్ కేఎం జోసఫ్ కు పదోన్నతి కల్పిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని కోరుతూ గతంలో కొలీజియం చేసిన సిఫారసును కేంద్రం తిప్పి పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రాకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ఓ లేఖ రాశారు.

జస్టిస్ జోసఫ్ ను ‘సుప్రీం’ న్యాయమూర్తిగా నియమించే విషయాన్ని పునరుద్ఘాటించే నిమిత్తం కొలీజియం సమావేశం ఏర్పాటు చేయాలని ఆ లేఖలో కోరారు. కాగా, జూన్ 22న చలమేశ్వర్ పదవీ విరమణ చేయనున్నారు. ఈ నెల 19 నుంచి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ప్రారంభం కానుండటంతో, ఈలోగా తన అధికారిక పనులను చలమేశ్వర్ పూర్తి చేయాల్సి ఉంది. 

More Telugu News