sensex: కర్ణాటక, ముడి చమురు, రూపాయి ప్రభావం.. నష్టపోయిన మార్కెట్లు

  • లాభాలతో ప్రారంభమైనా.. చివరకు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
  • లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
  • 73 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు ఉన్న నేపథ్యంలో, భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 120 పాయింట్లకు పైగా లాభపడింది. అయితే, కర్ణాటక ఎన్నికలు, బలహీనపడిన రూపాయి విలువ, పెరిగిన ముడి చమురు ధరలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. దీంతో, మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 73 పాయింట్లు నష్టపోయి 35,246కు పడిపోయింది. నిఫ్టీ 25 పాయింట్లను కోల్పోయి 10,717 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
వెల్స్ పన్ ఇండియా (6.02%), ప్యూచర్ రీటెయిల్ (4.67%), సియెంట్ లిమిటెడ్ (3.91%), ఫ్యూచర్ కన్జ్యూమర్ (3.87%), అదానీ ట్రాన్స్ మిషన్ లిమిటెడ్ (3.21%).

టాప్ లూజర్స్:
ఫెడరల్ బ్యాంక్ (-11.57%), జిందాల్ సా లిమిటెడ్ (-9.05%), ఇండియన్ బ్యాంక్ (-8.17%), స్ట్రైడ్స్ షాసూన్ లిమిటెడ్ (-7.90%), రిలయన్స్ కమ్యూనికేషన్స్ (-7.31%).

More Telugu News