jyothika: తెరపై రజనీకాంత్ వీరాభిమానిగా జ్యోతిక!

  • రీ ఎంట్రిలోను సక్సెస్ అయిన జ్యోతిక
  • విలక్షణమైన పాత్రలే కారణం 
  • మలయాళ హిట్ మూవీ పట్ల ఆసక్తి           

తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా జ్యోతికకి మంచి క్రేజ్ వుంది. రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత ఆమె తన వయసుకి తగిన పాత్రలను చేస్తూ సక్సెస్ లు అందుకుంటోంది. కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళుతోన్న జ్యోతిక, తమిళంలో ఒక రీమేక్ మూవీలో నటించడానికి సిద్ధమవుతోంది.

ఇటీవల మలయాళంలో 'మోహన్ లాల్' అనే సినిమా వచ్చింది. ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో 'మోహన్ లాల్' అభిమాని పాత్రలో మంజు వారియర్ నటించి మెప్పించింది. ఈ సినిమా కథ .. ఆ పాత్ర నచ్చడంతో రీమేక్ లో చేయడానికి జ్యోతిక ఆసక్తిని చూపింది. ఈ సినిమాలో ఆమె రజనీకాంత్ అభిమానిగా కనిపిస్తుందట. హాస్యంతో కూడిన సందేశాత్మక చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది.         

More Telugu News