mahanati: ఓ తండ్రిగా గర్వపడుతున్నా.. ఓ కొడుకుగా అసూయపడుతున్నా!: హీరో నాగార్జున

  • ‘మహానటి’లో నాగచైతన్య ఏఎన్ ఆర్ పాత్రలో నటించడంపై నాగ్ సంతోషం
  • నా తండ్రి పాత్రలో నేను ఇంతవరకూ నటించలేదు
  • ఆ పాత్రలో చైతన్య నటించడం చెప్పలేనంత ఆనందంగా ఉంది

‘మహానటి’ చిత్రంలో నాగ చైతన్య.. అక్కినేని నాగేశ్వరరావు పాత్రను పోషించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జున సంతోషం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘నేను ఓ తండ్రిగా గర్వపడుతున్నా.. ఓ కొడుకుగా అసూయపడుతున్నా. నా తండ్రి లెజెండరీ నటుడు ఏఎన్ఆర్ గారి పాత్రలో నేను ఇంతవరకూ నటించలేదు. కానీ, ‘మహానటి’లో నాగ చైతన్యను ఏఎన్ ఆర్ పాత్రలో చూపించినందుకు నాకు పట్టలేనంత సంతోషంగా.. చెప్పలేనంత ఆనందంగా ఉంది’ అని చెప్పిన నాగార్జున ఓ వీడియోను పోస్ట్ చేశారు. హీరో నాని వాయిస్ ఓవర్ లో అక్కినేని నాగేశ్వరరావు జీవిత విశేషాలను ఈ వీడియోలో పొందుపరిచారు.  

More Telugu News