Chiranjeevi: 'సైరా' కోసం కత్తి పట్టేస్తోన్న తమన్నా

  • సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా'
  • చిరూ సరసన నయనతార 
  • త్వరలో యాక్షన్ సీన్స్ చిత్రీకరణ

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' సినిమా షూటింగు జరుగుతోంది. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ఒక కీలకమైన పాత్ర కోసం తమన్నాను ఎంపిక చేసినట్టుగా వార్తలు వచ్చాయి. త్వరలో ఈ సినిమా షూటింగులో ఆమె జాయిన్ కానున్నట్టు సమాచారం.

ఈ సినిమాలో 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' కోసం ప్రాణాలను అర్పించే వీరనారిగా తమన్నా కనిపించనుంది. ఆమె కాంబినేషన్లోని యాక్షన్ సన్నివేశాలను త్వరలో చిత్రీకరించనున్నారు. ఈ సన్నివేశాలలో తమన్నా గుర్రంపై స్వారీ చేస్తూ కత్తియుద్ధం చేయనుంది. ఈ సన్నివేశాలు ఆడియన్స్ చే విజిల్స్ వేయించేలా వుంటాయని అంటున్నారు. 'బాహుబలి'తో తనలోని యాక్షన్ కోణాన్ని ఆవిష్కరించిన తమన్నా, 'సైరా' కోసం మరోమారు కత్తి పట్టనుందన్న మాట.     

More Telugu News