Pakistan: గుండు చేయించి, కనుబొమ్మలు పెరికి... పాక్ లో హిందూ వ్యాపారికి తీరని అవమానం!

  • పాక్ లో హిందువులపై పెరుగుతున్న దాడులు
  • వడ్డీ వ్యాపారిపై పోలీసుల దాష్టీకం
  • శిరోముండనం చేయించి మీసాలు, కనుబొమ్మలు తొలగించిన వైనం

హిందువులు అల్పసంఖ్యాక వర్గాలుగా ఉన్న పాకిస్థాన్ లో వారిపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. స్వాతంత్ర్యం వచ్చాక ఇండియాకు వెళ్లకుండా పాకిస్థాన్ లో స్థిరపడిన ఓ కుటుంబానికి చెందిన చున్నీలాల్ అనే వ్యాపారికి తాజాగా తీరని అవమానం ఎదురైంది. సింధ్ ప్రాంతంలో జరిగిన ఓ ఘటనపై పాకిస్థాన్ మానవ హక్కుల సంఘం కార్యకర్త కపిల్ దేవ్ వెల్లడించిన వివరాల ప్రకారం, చున్నీలాల్ వడ్డీ వ్యాపారి.

అధిక వడ్డీకి అతను అప్పిచ్చాడని ఆరోపిస్తూ, శికార్ పూర్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. శిరోముండనం చేయించడంతో పాటు మీసాలు, కనుబొమ్మలను తొలగించారు. హిందువుల సంఖ్య కేవలం 4 శాతంగా మాత్రమే ఉండటంతోనే ఈ తరహా ఘటనలు పెరిగిపోయాయని కపిల్ దేవ్ విచారం వ్యక్తం చేశాడు.

More Telugu News