Nayanatara: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • రొమాంటిక్ కామెడీ సినిమాలో నయనతార 
  • మామా అల్లుళ్ల ఘర్షణతో రామ్ సినిమా!
  • ఇంగ్లాండ్ బ్యాక్ డ్రాప్ లో అఖిల్ ప్రేమకథ!  

*  అటు స్టార్ హీరోలతో నటిస్తూనే.. ఇటు చిన్న హీరోలతో కూడా నటిస్తున్న నయనతార తాజాగా శివ కార్తికేయన్ సరసన నటించడానికి ఓకే చెప్పింది. ఎం.రాజేష్ దర్శకత్వం వహించే ఈ తమిళ చిత్రం రొమాంటిక్ కామెడీగా రూపొందుతుంది.  
*  రామ్ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న 'హలో గురూ ప్రేమకోసమే' చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. అనుపమ పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం మామా అల్లుళ్ల ఘర్షణ ప్రధానంగా సాగుతుందట. మామగా ప్రకాష్ రాజ్, అల్లుడిగా రామ్ నటిస్తున్నారు.
*  అఖిల్ అక్కినేని హీరోగా నటించే మూడో చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న సంగతి విదితమే. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం ఇంగ్లాండ్ లో జరుగుతుందట. దాంతో లండన్ పరిసరాల్లో షూటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.  

More Telugu News