Medak District: తెలంగాణలో నీటి తీరువా బకాయిలు రద్దు చేస్తున్నా!: సీఎం కేసీఆర్

  • మెదక్ కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవనాలకు శంకుస్థాపన 
  • నీటి తీరువా బకాయిలు సుమారు రూ.800 కోట్ల వరకు ఉన్నాయి
  • రాబోయే రోజుల్లో రైతుల నుంచి నీటి తీరువా వసూళ్లు ఉండవు

తెలంగాణ రాష్ట్రంలో నీటి తీరువా బకాయిలు రద్దు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. మెదక్ కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణాలకు ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ, నీటి తీరువా బకాయిలు సుమారు రూ.700 కోట్ల నుంచి రూ.800 కోట్ల వరకు ఉన్నాయని, రాబోయే రోజుల్లో రైతుల నుంచి నీటి తీరువా వసూళ్లు ఉండవని అన్నారు.

‘ఇవాళ నాకు సంతోషంగా ఉంది. కలలో కూడా అనుకోని ఒక మంచిపని జరిగింది. ఈ జిల్లాలోనే పుట్టి ఈ జిల్లాలోనే పెరిగాను. మెదక్ జిల్లా ప్రజల ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సాధించాను. మాయమాటలు చెప్పాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి యావత్ దేశం ఆశ్చర్యపోతోంది. రాష్ట్రంలో 2014కు ముందు విద్యుత్ ఉంటే వార్త..  ఇప్పుడు విద్యుత్ పోతే వార్త. భూ రికార్డుల ప్రక్షాళన కేవలం వంద రోజుల్లోనే చేయగలిగాం. అన్ని రంగాల్లో త్వరితగతిన మంచి ఫలితాలు సాధిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు.

More Telugu News