lalu prasad yadav: లాలూ కుటుంబానికి సంబంధించి 20వేల డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించిన సీబీఐ

  • ఐఆర్సీటీసీ కుంభకోణంపై సీబీఐ విచారణ
  • నెల క్రితం రబ్రీ, తేజస్విలను విచారించిన సీబీఐ
  • క్విడ్ ప్రోకో జరిగిందని వాదిస్తున్న సీబీఐ

ఐఆర్సీటీసీ హోటల్స్ కుంభకోణానికి సంబంధించి తాము సేకరించిన 20వేల డాక్యుమెంట్లను పటియాలా కోర్టుకు సీబీఐ సమర్పించింది. ఈ కుంభకోణంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు నిందితులుగా ఉన్నారు. లాలూ భార్య రబ్రీదేవి, కుమారుడు తేజశ్వి యాదవ్ ను విచారించిన నెల రోజుల తర్వాత ఈ డాక్యుమెంట్లను కోర్టుకు అందజేసింది.

2006లో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఐఆర్సీటీసీకి చెందిన రెండు హోటళ్ల మెయింటెనెన్స్ కాంట్రాక్టులను ఓ ప్రైవేట్ కాంట్రాక్టరుకు అప్పగించారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ కు, లాలూ కుటుంబానికి మధ్య క్విడ్ ప్రోకో జరిగిందని... మూడెకరాల విలువైన భూమిని లాలూ ప్రసాద్ లంచంగా తీసుకున్నారని సీబీఐ వాదిస్తోంది. ఈ కుంభకోణంలో లాలూ కుటుంబసభ్యులు కూడా ఉన్నారని ఆరోపిస్తోంది.

More Telugu News