vijay devarakonda: విజయ్ దేవరకొండ బర్త్ డే.. ‘టాక్సీవాలా’ టీజర్ విడుదల

  • విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ‘టాక్సీవాలా’
  • టీజర్ లో చాలా స్టైలిష్ గా కనపడ్డ హీరో
  • ‘హ్యాపీ బర్త్ డే' చెప్పిన చిత్ర యూనిట్

యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న చిత్రం టాక్సీవాలా. ఈరోజు విజయ్ బర్త్ డే కావడంతో ఈ సందర్భంగా ‘టాక్సీవాలా’ టీజర్ ను చిత్రయూనిట్ ఈరోజు విడుదల చేసింది. ఈ టీజర్ లో విజయ్ చాలా స్టైలిష్ గా కనపడ్డాడు. ‘హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ .. టీమ్ టాక్సీవాలా’ అని చిత్ర యూనిట్ పేర్కొంది.

కాగా, ‘మహానటి’ చిత్రంలో విజయ్ దేవరకొండ ఓ చిన్నపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో తాను కూడా ఓ పాత్ర పోషించినందుకు చాలా గర్వపడుతున్నానని, ఈ అవకాశం తనకు కల్పించిన నాగ్ అశ్విన్, ప్రియాంక దత్ కు తన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. 

More Telugu News