Nani: నాని చేతుల మీదుగా 'డెడ్ పూల్ 2' తెలుగు ట్రైలర్ లాంచ్

  • భారీ యాక్షన్ మూవీగా 'డెడ్ పూల్ 2'
  • తెలుగులోకి అనువాదం 
  • ఈ నెల 18వ తేదీన విడుదల

హాలీవుడ్ సినిమాలు భారీతనానికి ప్రతీకగా కనిపిస్తూ ఉంటాయి. ఉత్తరాది .. దక్షిణాది భాషల్లోను ఈ సినిమాలు సందడి చేస్తుంటాయి. విభిన్నమైన గెటప్ లు .. అద్భుతమైన సౌండ్ సిస్టమ్స్ .. కళ్లు చెదిరిపోయే గ్రాఫిక్స్ వర్క్ తో ఈ సినిమాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంటాయి.

అలా భారీ యాక్షన్ మూవీగా 'డెడ్ పూల్ 2' తెలుగు వెర్షన్ ఈ నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు. నాని చేతుల మీదుగా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. యూత్ ను .. పిల్లలను ఆకట్టుకునేలా ఈ ట్రైలర్ వుంది. వేసవి సెలవుల్లో వస్తుండటం వలన , ఈ సినిమాకి వసూళ్లు బాగానే వుండే అవకాశం వుంది.

More Telugu News