lpg cylinder: వంటగ్యాస్ పై రూ.100 వరకు భారం తగ్గింది: కేంద్ర ప్రభుత్వం

  • ఢిల్లీ మార్కెట్లో రూ.650కు తగ్గుదల
  • సబ్సిడీ సిలిండర్ పైనా ధర రూ.491కు తగ్గుముఖం
  • పెట్రోలియం శాఖ ప్రకటన

వంటగ్యాస్ పై గత మూడు నెలల కాలంలో రూ.100 వరకు భారం తగ్గిందని పెట్రోలియం శాఖ ప్రకటించింది. ఇటీవలి కాలంలో వంటగ్యాస్ ధరలు క్రమంగా పెరుగుతూ పోయాయంటూ కథనాలు రావడంపై సదరు సంస్థ స్పందించింది. సబ్సిడీ లేని రిటైల్ వంటగ్యాస్ ధర ఢిల్లీలో డిసెంబర్ లో రూ.747గా ఉండగా, అది మే నెలలో రూ.650.50కు తగ్గినట్టు వివరించింది. నికరంగా తగ్గుదల రూ.96.50.

సబ్సిడీ సిలిండర్ పైనా ధర డిసెంబర్ లో ఉన్న రూ.495.69 నుంచి మే నెలలో రూ.491.21కు తగ్గినట్టు పెట్రోలియం శాఖ ప్రకటించింది. ఏడాదికి 12 సిలిండర్లు సబ్సిడీ ధరలపై పొందేందుకు వినియోగదారులకు అనుమతి ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిమితి దాటిన తర్వాత మార్కెట్ ధరల ఆధారంగా తీసుకునే వాటిని నాన్ సబ్సిడీ సిలిండర్లుగా పేర్కొంటారు.

More Telugu News