america: అమెరికాలో ఘంటసాల, బాలు పేరిట సినీ సంగీత కచేరీలు!

  • ఈ నెల 12 నుంచి ఘంటసాల ఆరాధనోత్సవాలు
  • 13 నుంచి హ్యూస్టన్‌లో 8వ బాలు సంగీతోత్సవాలు
  • ఎటువంటి ప్రవేశ రుసుం లేదు

ఈ నెల 12 నుంచి అమెరికాలోని వివిధ నగరాల్లో 'అలనాటి మేటి పాటలు-ఈ నాటి మధురగీతాలు' పేరిట సంగీత కచేరీలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా డలాస్‌లో 12న ఘంటసాల ఆరాధనోత్సవాలు, 13న హ్యూస్టన్‌లో బాలు సంగీతోత్సవాలు ప్రారంభమవుతాయి. జులై 8 వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఎటువంటి ప్రవేశ రుసుం లేదు.

ఘంటసాల ఆరాధనోత్సవాలు గ్రీన్‌విల్లే, ఛార్లెట్ట్‌, టెక్సాస్‌, డలాస్‌, హ్యూస్టన్‌, న్యూ జెర్సీ, పీరియా, షికాగో, నగరాల్లో నిర్వహించనున్నారు. ఈ సినీ సంగీత కచేరీలను వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా హైదరాబాద్‌లోని వేగేశ్న ఫౌండేషన్ దివ్యాంగుల సేవాశ్రమానికి విరాళాలు సేకరించనున్నట్లు పేర్కొంది.

ఈ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికి కొన్ని తేదీలను ఖరారు చేయగా.. మరికొన్ని తేదీలను ఖరారు చేయాల్సి ఉంది. ఈ నెల 18, 20, 25, 26, 27 తేదీల్లోను, వచ్చేనెల 1, 8, 22, 24, 29 తేదీల్లోను ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మిగతా తేదీలను త్వరలోనే ప్రకటిస్తారు. 98490 23852 లేక 83259 49054 నెంబర్లకు ఫోన్‌ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

More Telugu News