rana: యుద్ధం నేపథ్యంలో రానాతో తేజ మూవీ?

  • ప్రేమ కథలు చేస్తూ వచ్చిన తేజ
  • విభిన్నమైన కథల వైపు మొగ్గు 
  • మళ్లీ రానాతో చేసే ఛాన్స్  

మొదటి నుంచి కూడా ప్రేమకథలను ఎక్కువగా చేస్తూ వచ్చిన తేజ, ఆ తరువాత విభిన్నమైన కథా వస్తువులను సిద్ధం చేసుకోవడంపై దృష్టి పెట్టాడు. ఈ నేపథ్యంలో వెంకటేశ్ తో ఒక సినిమా .. ఎన్టీఆర్ బయోపిక్ ను రూపొందించే అవకాశాలు ఆయనకి వచ్చాయి. అయితే కొన్ని కారణాల వలన, ఆయన ఈ రెండు ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే నాగార్జునతో ఒక సినిమా చేయాలనుకుంటున్నాడనే టాక్ వచ్చింది. ఇక తాజాగా రానా పేరు తెరపైకి వచ్చింది. యుద్ధం నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమా కొనసాగుతుందని అంటున్నారు. ఈ సినిమాలో రానా ఇండియన్ ఎయిర్ ఫోర్స్  పైలెట్ గా కనిపిస్తాడని అంటున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. గతంలో రానా .. తేజ కాంబినేషన్లో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.  

More Telugu News