టీడీపీ మహానాడుకు వేదిక ఖరారు!

08-05-2018 Tue 10:09
  • ఈనెల 23 నుంచి మూడు రోజుల పాటు మహానాడు
  • విజయవాడ కానూరులోని సిద్ధార్థ కాలేజీ మైదానంలో వేడుక
  • కాలేజీ ప్రాంగణాన్ని పరిశీలించిన కళావెంకట్రావు

ఈనెల 23వ తేదీ నుంచి మూడు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం జరగనుంది. విజయవాడలోని కానూరులో ఈ వేడుకను నిర్వహించనున్నారు. కానూరులోని సిద్ధార్థ కాలేజీ మైదానంలో నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి కళావెంకట్రావు ఈ ఉదయం కాలేజీ ప్రాంగణాన్ని పరిశీలించారు.

 మరోవైపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో పలు కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో... ఈ మహానాడు ద్వారా పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. తద్వారా పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపనున్నారు.