108: తెలంగాణలో అందుబాటులోకి 145 కొత్త '108' వాహనాలు... జీపీఎస్‌ అనుసంధానం కూడా!

  • ప్ర‌స్తుతం రాష్ట్రంలో 316 వాహనాలు
  • 365 రోజులు, 24 గంట‌ల పాటు ఉచిత వైద్య ఆరోగ్య‌ సేవ‌లు
  • ల‌క్ష్యాల‌కు మంచి ప్ర‌జ‌ల‌కు సేవ‌లు

తెలంగాణలో ప్ర‌స్తుతం 316 '108' ఉచిత సేవల వాహ‌నాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, అందులోని 145 వాహ‌నాల స్థానంలో కొత్త‌ వాహ‌నాలు ప్ర‌జ‌ల‌కు చేరువ కానున్నాయి. ఎమర్జన్సీ, ఇత‌ర వైద్య స‌హాయ సేవ‌ల‌్లో 108 వాహ‌నాలు సేవ‌లు అందిస్తున్నాయి. రేపు హైద‌రాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి కొత్త వాహనాలను ప్రారంభించనున్నారు. 365 రోజులు 24 గంట‌ల పాటు 108 వాహ‌నాలు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నాయి. మేడ్చల్ లోని కేంద్రీ‌కృత కేంద్రం ద్వారా మొత్తం 316 వాహ‌నాలు న‌డుస్తున్నాయి.

కొత్త వాహనాల ప్రత్యేకత
మెరుగైన వైద్య సేవ‌ల కోసం 108 వాహ‌నాల‌ను జీపీఎస్ ద్వారా అనుసంధానించారు. తెలంగాణ కుటుంబ సంక్షేమ‌శాఖ క‌మిష‌న‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఈ వాహ‌నాలు ప‌ని చేస్తున్నాయి. కాగా,  ప్ర‌తి రోజూ 108 వాహనాలు 1,453 సేవ‌ల‌ను అందిస్తున్నాయి. ప్ర‌తి వాహ‌నం నెల‌లో స‌రాస‌రిన కి.మీ. 4,500 ప్రయాణించాల్సి వుండగా, 5,127 కి.మీ వరకు ప్ర‌యాణిస్తోంది. ప్ర‌తి నెలా 316 వాహ‌నాల ద్వారా అత్య‌వ‌స‌ర ప్ర‌స‌వ సేవ‌ల ల‌క్ష్యం 10,500 కాగా, అంతకు మించి 14,723 సేవలను అందిస్తున్నాయి.

ప్ర‌స‌వానంత‌ర సేవ‌ల్లోనూ 2,323 మందిని వారి వారి ఇళ్లకు క్షేమంగా చేర్చాయి. ల‌క్ష్యాల‌కు మించి ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందిస్తూ 108 వాహ‌నాలు ప్ర‌జ‌ల‌కు ఎంతో మేలు చేస్తున్నాయి.

More Telugu News