Salman Khan: సల్మాన్‌, హనుమాన్‌లా పెళ్లి చేసుకోకుండా ఉంటే ఎంత బాగుంటుంది!: ఆకట్టుకుంటున్న 'చి.ల.సౌ' సినిమా టీజర్‌!

  • సుశాంత్‌ నటిస్తోన్న చి.ల.సౌ
  • టీజర్‌ విడుదల చేసిన రానా
  • అదరగొడుతోన్న కామెడీ

రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడిగా యువ కథానాయకుడు సుశాంత్‌ నటిస్తోన్న 'చి.ల.సౌ.' సినిమా టీజర్‌ను సినీనటుడు దగ్గుబాటి రానా ఈ రోజు విడుదల చేశాడు. ఈ సినిమాలో కొత్త అమ్మాయి రుహని శర్మ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. తన పేరు అర్జున్‌ అని, తాను సల్మాన్‌ ఖాన్‌ అభిమాని, ఆంజనేయస్వామి భక్తుడినని సుశాల్‌ ఈ టీజర్‌లో చెప్పాడు.

సల్మాన్‌, హనుమాన్‌లా శాశ్వతంగా పెళ్లి చేసుకోకుండా ఉంటే ఎంత బాగుంటుంది? అని సుశాల్‌ అంటుండగా.. మరోవైపు ఆంజనేయుడి ముందు కొడుకు మనసు మార్చాలని అతడి తల్లి వేడుకోవడాన్ని ఇందులో చూపించారు. ఈ సినిమాలో కామెడీ అధికంగా ఉంటుందని ఈ టీజర్‌ ద్వారా చెప్పొచ్చు.                                                                                

More Telugu News