akhil: విదేశాల్లోనూ అఖిల్ మూవీ షూటింగ్

  • వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ 
  • కథానాయికగా నిధి అగర్వాల్ 
  • వచ్చేనెలలో రెగ్యులర్ షూటింగ్ 

వెంకీ అట్లూరి దర్శకత్వంలో తన తదుపరి సినిమాను చేయడానికి అఖిల్ రెడీ అవుతున్నాడు. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును జరపడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రేమ కథాంశంగా రూపొందనున్న ఈ సినిమాలో అఖిల్ కి జోడీగా నిధి అగర్వాల్ నటించనున్నట్టు తెలుస్తోంది.

కథ ప్రకారం ఈ సినిమాలోని కొన్ని కీలకమైన సన్నివేశాలను .. పాటలను యు.కె.లో చిత్రీకరించనున్నారు. మూడువారాల పాటు అక్కడ ఈ సినిమా షూటింగ్ కొనసాగనుంది. ఇంతకు ముందు వెంకీ అట్లూరి చేసిన 'తొలిప్రేమ' సినిమాలోనూ కొన్ని సన్నివేశాలను యు.కె.లో చిత్రీకరించాడు. ఆ సన్నివేశాలు యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేశాయి. అలాగే ఈ సినిమాలోను యు.కె.లో చేయనున్న సన్నివేశాలు ఆడియన్స్ మనసు దోచుకునేలా వుంటాయని అంటున్నారు.   

More Telugu News