hero venkatesh: చిన్నారులతో సరదాగా..బ్యాడ్మింటన్ ఆడిన హీరో వెంకటేష్

  • చిన్నారులతో కలిసి రోడ్డుపై బ్యాడ్మింటన్ ఆడిన వెంకటేష్
  • ఈ దృశ్యాన్ని సెల్ ఫోన్లలో చిత్రీకరించిన వైనం
  • వెంకటేష్ తో కలిసి సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి

చిన్నారులతో కలిసి హీరో వెంకటేష్ సరదాగా కాసేపు బ్యాడ్మింటన్ ఆడాడు.. రోడ్డుపై బ్యాడ్మింటన్ ఆడుకుంటున్న చిన్నారుల వద్దకు వెళ్లి తనూ వారితో జత కలిపాడు. ఊహించని ఈ సంఘటనతో చిన్నారులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. ఈ దృశ్యాన్ని సెల్ ఫోన్లలో చిత్రీకరించారు.

 వెంకటేష్ తో కలిసి సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. అనంతరం, తన వాహనంలో వెంకటేష్ వెళ్లిపోయాడు. అయితే, ఈ సరదాగా సంఘటన ఏ ఏరియాలో జరిగిందో తెలియదు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారింది. 

More Telugu News