Hawai: 40 ఏళ్లలో ఎన్నడూ రాని భారీ భూకంపం... హవాయిలో బద్దలైన కిలౌయీ అగ్నిపర్వతం!

  • రిక్టర్ స్కేలుపై 7.4 శాతంగా నమోదు 
  • శుక్రవారం నాడు రెండు భూకంపాలు
  • ఆపై శనివారం మరొకటి.. ప్రజల్లో తీవ్ర ఆందోళన

పసిఫిక్ మహాసముద్రంలోని హవాయి దీవుల చరిత్రలో ఎన్నడూ లేనంత తీవ్రతతో రిక్టర్ స్కేలుపై 7.4గా భూకంపం సంభవించగా, దీవిలోని అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వతంగా పేరున్న కిలౌయి బద్దలైంది. గడచిన 40 సంవత్సరాల్లో ఏర్పడిన భూకంపాల్లో ఇదే అతిపెద్దదని, అమెరికన్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

కాగా, శుక్రవారం నాడు హవాయి దీవుల్లో 5.6, 6.9 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించగా, అప్పటికే వణికిపోతున్న ప్రజలు, తాజా భూకంపంతో మరింత ఆందోళనలో మునిగిపోయారు. మరోవైపు కిలౌయీ ప్రాంతంలో 1,700 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మరింత మందిని హెచ్చరించారు. అగ్నిపర్వతం కారణంగా పెద్దఎత్తున సల్ఫర్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదల అవుతుండగా, ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపడుతోంది.

More Telugu News