Tirupati: పెళ్లయిందన్నా వదలడం లేదు... మార్కులేయమంటున్నారు!: తిరుపతి రూయా ప్రొఫెసర్లపై గవర్నర్ కు విద్యార్థిని లేఖ

  • ప్రొఫెసర్లు వేధిస్తున్నారు
  • లొంగిపోకుంటే ప్రాక్టికల్స్ మార్కులు వేయరట
  • గవర్నర్ కు లేఖ రాసిన విద్యార్థిని
  • విచారణకు ఆదేశించిన నరసింహన్

కొందరు ప్రొఫెసర్లు తమను లైంగికంగా వేధిస్తున్నారని, వివాహమైందని చెబుతున్నా వినిపించుకోకుండా, మార్కుల భయాన్ని చూపించి, కోరిక తీర్చమంటున్నారని ఆరోపిస్తూ, పలువురు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పేర్లను ప్రస్తావిస్తూ, తిరుపతి రూయా చిన్నపిల్లల ఆసుపత్రిలో పీజీ విద్యార్థిని గవర్నర్ నరసింహన్ కు లేఖ రాయడం కలకలం రేపుతోంది. ఇక తనకు అందిన లేఖను సీరియస్ గా తీసుకున్న గవర్నర్, వెంటనే విచారణకు ఆదేశించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

తానో వివాహితనని, పీడియాట్రిక్స్ విభాగం హెడ్ రవికుమార్ తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ కిరీటి, అసోసియేట్ ప్రొఫెసర్ శశికుమార్ లు తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని, వారి వేధింపులను తట్టుకోలేక, ఎదిరించలేక నలిగిపోతున్నానని తన ఫిర్యాదులో బాధితురాలు వాపోయింది. ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని, లొంగిపోకుంటే ప్రాక్టికల్ మార్కులు వేయబోమని బెదిరించారని చెప్పింది. ఇక దీనిపై ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ వైస్ చాన్స్ లర్, ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ లను విచారించి నివేదిక ఇవ్వాలని గవర్నర్ ఆదేశించారు.

More Telugu News