Hyderabad: వరుసగా నాలుగో విజయంతో ప్లేఆఫ్ ను దాదాపు ఖాయం చేసుకున్న హైదరాబాద్ సన్ రైజర్స్!

  • ఆడిన 9 మ్యాచ్ లలో ఏడింట విజయం
  • 14 పాయింట్లతో అగ్రస్థానంలో సన్ రైజర్స్
  • మరొక్క మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ ఖాయం

ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఇప్పటివరకూ ఆడిన 9 మ్యాచ్ లలో ఏడింటిలో గెలిచిన హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 14 పాయింట్లు సాధించగా, ప్లే ఆఫ్ కు దాదాపు అర్హత సాధించినట్టే. పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉన్న ఢిల్లీ, రాజస్థాన్, బెంగళూరు జట్లు తాము ఆడాల్సిన అన్ని మ్యాచ్ లనూ గెలవడం వంటి అద్భుతం జరిగితే తప్ప హైదరాబాద్ ప్లే ఆఫ్ అవకాశాలను అడ్డుకోవడం అసాధ్యం. ఇక హైదరాబాద్ మరో ఐదు మ్యాచ్ లు ఆడాల్సి వుండగా, కనీసం ఒక్క మ్యాచ్ లో గెలిస్తే ప్లే ఆఫ్ స్థానం ఖాయమైపోతుంది.

గత రాత్రి హోమ్ గ్రౌండ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 163 పరుగులు మాత్రమే చేసింది. ఆపై హైదరాబద్ ఓపెనర్లు అలెక్స్, ధావన్ లు వరుసగా 45, 33 పరుగులు చేసి శుభారంభాన్ని అందించడంతో సన్ రైజర్స్ విజయం ఖరారైంది. ఏడు వికెట్ల తేడాతో ఈ మ్యాచ్ గెలిచిన సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

More Telugu News