TTD: తిరుమల శ్రీవారి భక్తుల్లో భయాందోళనలు వద్దు: టీటీడీ ఈవో ప్రకటన

  • పురావస్తు శాఖ డైరెక్టర్‌ జనరల్ ఫోన్‌ చేశారు
  • ఆలయాలను తమ అధీనంలోకి తీసుకునే ఆలోచన లేదన్నారు
  • పురావస్తు శాఖ రాసిన లేఖను ఉపసంహరించుకుంది

కేంద్ర ప్రభుత్వ యోచన పట్ల తిరుమల శ్రీవారి భక్తుల్లో భయాందోళనలు వద్దని టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్ అన్నారు. తిరుమల ఆలయాలన్నీ పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకోవాలని కేంద్ర సర్కారు యోచిస్తోన్న నేపథ్యంలో టీటీడీ ఈవో  మీడియాతో మాట్లాడుతూ... పురావస్తు శాఖ డైరెక్టర్‌ జనరల్ తమకు ఫోన్‌ చేశారని అన్నారు.

తిరుమల ఆలయాలను తమ అధీనంలోకి తీసుకునే ఆలోచన లేదని ఢిల్లీ నుంచి ఫోన్‌ చేసి ఆ శాఖ డీజీ చెప్పారని అనిల్‌ కుమార్‌ సింఘాల్ ప్రకటించారు. ఆలయాల అంశంలో జరుగుతోన్న అంశంపై ఆందోళన వద్దని, పురావస్తు శాఖ రాసిన లేఖను ఉపసంహరించుకుందని చెప్పారు. కాగా, తిరుమల తిరుపతి ఆలయాలను పరిశీలించాల్సి ఉందంటూ పురావస్తు శాఖ రాసిన లేఖతో ఈ రోజు దుమారం చెలరేగింది.          

More Telugu News