flipkart: ఫ్లిప్ కార్ట్ ఇక వాల్ మార్ట్ గూటికి చేరడమే తరువాయి... 75శాతం వాటాల విక్రయానికి అంగీకారం

  • పది రోజుల్లోపు డీల్ పూర్తి
  • గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ కు కూడా కొంత వాటా
  • డీల్ విలువ 15 బిలియన్ డాలర్లు

అమెరికా దిగ్గజ రిటైల్ సంస్థ వాల్ మార్ట్ చేతికి దేశీయ అగ్రగామి ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ వెళ్లడమే మిగిలి ఉంది. 75 శాతం వాటాను వాల్ మార్ట్ కు విక్రయించేందుకు ఫ్లిప్ కార్ట్ బోర్డు అంగీకరించింది. దీని విలువ 15 బిలియన్ డాలర్లు. ఫ్లిప్ కార్ట్ సంస్థ మొత్తం విలువను 20 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టారు. వాల్ మార్ట్ తో పాటు గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కూడా ఫ్లిప్ కార్ట్ లో కొంత వాటా తీసుకుంటోంది. ఫ్లిప్ కార్ట్ లో జపాన్ కు చెందిన సాఫ్ట్ బ్యాంకుకు 25 శాతం వాటా ఉండగా, అందులో 20 శాతం వాటాను విక్రయిస్తోంది. పది రోజుల్లోపే ఈ డీల్ పూర్తయిపోతుందని సమాచారం. ఈ కొనుగోలుతో వాల్ మార్ట్ దేశవ్యాప్తంగా కస్టమర్లను సొంతం చేసుకోనుంది. ఫ్లిప్ కార్ట్ ను అమెరికాకే చెందిన ఈ కామర్స్ సంస్థ అమేజాన్ కూడా కొనుగోలు చేయాలని ప్రయత్నించింది. 22 బిలియన్ డాలర్ల విలువ కట్టి చెల్లించేందుకు ముందుకు కూడా వచ్చింది. కానీ, ఫ్లిప్ కార్ట్ లో వాాటాదారులు వాల్ మార్ట్ కే విక్రయించేందుకు మొగ్గు చూపారు. 

More Telugu News