Venkaiah Naidu: ఐదు రోజుల విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • గ్వాటెమాల, పెరు, పనామా దేశాల్లో పర్యటన
  • ద్వైపాక్షిక సంబంధాలు, పెట్టుబడులపై చర్చలు
  • వెంకయ్యకు ఉపరాష్ట్రపతిగా ఇది తొలి విదేశీ పర్యటన

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఐదు రోజుల విదేశీ పర్యటన కోసం ఈ రోజు బయల్దేరి వెళ్లారు. దక్షిణ అమెరికాలోని గ్వాటెమాలా, పెరు, పనామాలో ఆయన పర్యటించనున్నారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు, పెట్టుబడుల అంశాలపై చర్చలు జరపనున్నారు. మూడు దేశాధినేతలతో వెంకయ్య సమావేశం అవుతారు. అనంతరం ఆయా దేశాల పార్లమెంటేరియన్లతోనూ భేటీ అవుతారు. ఈ పర్యటనలో భాగంగా ప్రముఖ యూనివర్సిటీలను కూడా సందర్శిస్తారు. వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి అయిన తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఆయన వెంట ఓ బృందం కూడా వెళ్లింది. వారిలో గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జస్వంత్ సిన్హ్ సుమన్ భాయ్, పార్లమెంటు సభ్యులు, సీనియర్ అధికారులు ఉన్నారు.

More Telugu News