దర్శకరత్న దాసరికి ‘భారతరత్న’ ఇవ్వాలి: సినీ నటుడు మురళీమోహన్

05-05-2018 Sat 06:32
  • హైదరాబాద్ లో దాసరి నారాయణరావు జయంతి కార్యక్రమం
  • దాసరికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఇవ్వాలి
  • దర్శకరత్నకు ఈ పురస్కారాలు దక్కేందుకు పోరాడతాం

దర్శకరత్న దాసరి నారాయణరావుకు అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు ఇవ్వాలని టీడీపీ ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్ అన్నారు. దాసరికి ఈ పురస్కారాలు దక్కేందుకు పార్లమెంట్ లో పోరాడతామని చెప్పారు. కాగా, దాసరి నారాయణరావు జయంతిని హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్ ఆవరణలో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి విగ్రహాన్ని మంత్రి తలసాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ హీరోలు సూపర్ స్టార్ కృష్ణ, నందమూరి బాలకృష్ణ, నిర్మాతలు డి.సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.