stock market: మార్కెట్లపై కర్ణాటక ఎఫెక్ట్.. పతనమైన సెన్సెక్స్

  • ఎఫ్ఎంసీజీ, మెటల్, ఆటో స్టాక్స్ లో వెల్లువెత్తిన అమ్మకాలు
  • 188 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
  • 61 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

ఓవైపు అమెరికా-చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం... మరోవైపు అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు... దీనికి తోడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల హీట్... వెరసి, మన స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ, మెటల్, హెల్త్ కేర్, ఆటో స్టాక్స్ లో అమ్మకాలు వెల్లువెత్తడంతో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 188 పాయింట్లు నష్టపోయి 34,915కి పడిపోయింది. నిఫ్టీ 61 పాయింట్లు పతనమై 10,618కి జారుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పీసీ జువెలర్స్ (43.72%), జస్ట్ డయల్ (14.19%), రతన్ ఇండియా పవర్ (9.42%), బాంబే డయింగ్ (5.50%), హిందుస్థాన్ కన్ స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (5.13%).

టాప్ లూజర్స్:
హెక్సావేర్ టెక్నాలజీస్ (-14.15%), జేఎస్ డబ్ల్యూ ఎనర్జీ లిమిటెడ్ (-7.66%), అజంతా ఫార్మా (-5.38%), క్యాస్ట్రాల్ ఇండియా (-5.38%), టాటా ఎల్ క్సి లిమిటెడ్ (-5.14%).      

More Telugu News