vaishnav tej: మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో .. దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్

  • హీరోగా వైష్ణవ్ తేజ్ 
  • దర్శకుడిగా అవసరాల 
  • మరో సినిమా చిరు చిన్నల్లుడు కల్యాణ్ తో    

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యువ కథానాయకులంతా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, తమకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. బన్నీ .. చరణ్ లు స్టార్ హీరోలుగా క్రేజ్ ను తెచ్చుకోగా, వరుణ్ తేజ్ .. సాయిధరమ్ తేజ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాయిధరమ్ తేజ్ తమ్ముడైన వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే అందుకు కావలసిన శిక్షణను వైష్ణవ్ తేజ్ పూర్తిచేశాడని అంటున్నారు. సాయి కొర్రపాటి నిర్మించే ఈ సినిమాకి అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ సినిమా తరువాత చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ తోను అవసరాల ఒక సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. అవసరాల దర్శక ప్రతిభ పట్ల గల నమ్మకంతో ఈ రెండు ప్రాజెక్టులను ఆయనకి అప్పగించినట్టుగా చెప్పుకుంటున్నారు.     

More Telugu News