Allu Arjun: తమిళ .. మలయాళ భాషల్లో 'సూర్య' జోరు

  • ఈ రోజే విడుదలైన 'నా పేరు సూర్య'
  • తమిళ .. మలయాళ భాషల్లోను ఈ రోజునే
  • యాక్షన్ .. ఎమోషన్ కి ప్రాధాన్యత

తెలుగు ప్రేక్షకులలో స్టైలిష్ స్టార్ గా అల్లు అర్జున్ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక తమిళ .. మలయాళ భాషల్లోను తన సినిమాలను రిలీజ్ చేస్తూ ఆ రెండు ప్రాంతాల్లోను అభిమానుల సంఖ్యను పెంచుకుంటూ వచ్చాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తాజా సినిమా 'నా పేరు సూర్య'ను తమిళ .. మలయాళ భాషల్లోకి అనువదించారు.

తమిళంలో 'ఎన్ పెయిర్ సూర్య ఎన్ వీడు ఇండియా' పేరుతోనూ, మలయాళంలో 'ఎండె పేరు సూర్య ఎండె వీడు ఇండియా' అనే పేరుతోను ఈ రోజునే విడుదలైంది. తెలుగుతో పాటు ఈ రెండు ప్రాంతాల్లోను ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలోని యాక్షన్ .. ఎమోషన్ సన్నివేశాలు, అల్లు అర్జున్ పాత్రను తీర్చిదిద్దిన తీరు ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయని అంటున్నారు.      

More Telugu News